SA-2 Exams from the 6th 6 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:43 PM
SA-2 Exams from the 6th జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 6 నుంచి 16 వరకు ఎస్‌ఏ-2 (సమ్మెటివ్ అసెస్‌మెంట్-2) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధ వారం జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు అందాయి.
గరుగుబిల్లి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 6 నుంచి 16 వరకు ఎస్‌ఏ-2 (సమ్మెటివ్ అసెస్‌మెంట్-2) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధ వారం జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు అందాయి. ఒకటి నుంచి 9 తరగతుల వారికి ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం వేసవి దృష్ట్యా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈవోలను ఆదేశించారు. పరీక్ష పత్రాలను ఈ నెల 20లోగా పరిశీలించాలని, 22న విద్యార్థులకు ప్రోగ్రస్ కార్డులను అందించాలని సూచించారు. ఎస్‌ఏ-2 పరీక్షల అనంతరం పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నుట్లు ఆయన వెల్లడించారు.