Share News

పైడిమాంబ దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:12 AM

పైడిమాంబ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో అమ్మ దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది.

  పైడిమాంబ దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

విజయనగరం కల్చరల్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో అమ్మ దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. చదురు గుడిలోని పైడిమాంబను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు బారులు తీరారు. ఘాటాలతో అమ్మవారిని చల్లదనం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే దేవ దాయ శాఖాధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మూడు లాంతర్ల నుంచి చదురుగుడికి వెళ్లే రహదారిలో ద్విచక్ర వాహనాలు మినహా మిగతా వాహనా లను అనుమతించడం లేదు. సాయంత్రం నుంచి డీసీసీబీ కార్యాలయం నుంచి మూడ లాంతర్లు కూడలి వైపు కేవలం ద్విచక్ర వాహనాలు, వీఐపీ వాహనాలనే పంపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గింది. పోలీసు బందో బస్తు మరింత పెంచారు. ప్రధాన కూడలిలో వాహనాల తనిఖీ కూడా ప్రారంభిం చారు. నగరంతో పాటు పైడిమాంబ చదురుగుడి, వనంగుడి ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు. ఈనెల 26న తొలేళ్లు, 27న సిరిమానోత్సవం జరగనున్నది.

Updated Date - Oct 19 , 2026 | 12:12 AM