పాడి అభివృద్ధితోనే పల్లెల ప్రగతి
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:12 AM
పాడిపశువుల అభివృద్ధితోనే పల్లెలు ప్రగతి సాధిస్తామని రాష్ట్ర సూ క్ష్మ, చిన్న, మధ్య తరహా, ఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికార సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివా స్ అన్నారు.
బొండపల్లి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పాడిపశువుల అభివృద్ధితోనే పల్లెలు ప్రగతి సాధిస్తామని రాష్ట్ర సూ క్ష్మ, చిన్న, మధ్య తరహా, ఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికార సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివా స్ అన్నారు. దేవుపల్లి గ్రామంలో గజపతినగరం ఏఎం సీ అధ్యక్షుడు పీవీవీ గోపాలరాజు ఆధ్వర్యంలో నిర్వ హించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. తొలుత లేగదూడల ప్రదర్శనను ప్రారంభించి.. అనంతరం రైతన్న మీకోసం కరపత్రా లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభి వృద్ధితోనే పల్లెలు ఆర్థికాభివృద్ధి సాధిస్తాయన్నారు. రానున్న వేసవిలో పశుగ్రాసం కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వందశాతం రాయితీపై పశుగ్రాస పెంప కానికి ప్రోత్సాహం అందిస్తుందన్నారు. పశుగ్రాస పెంప కానికి అవసరమైన సాగునీరు పొందేందుకు తాను వ్యక్తిగతంగా రూ.20వేలు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మినీ గోకులాలు జిల్లాలో వెయ్యి లక్ష్యం కాగా 1579 మంజూరు చేసి, ఇందులో 773 పూర్తయ్యాయని, మిగిలినవి 906 వివిధ దశల్లో ఉన్నాయని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 50 శాతం రాయితీపై పశుదాణా, పశు గ్రాస విత్తనాలు అందిస్తున్నట్టు చెప్పారు. అలానే పాడి అభివృద్ధికి ఆడదూడలు పుట్టేందుకు వీలుగా వీర్యదా నం ఇంజక్షన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలానే 35 శాతం రాయితీతో మందులు అందించేందుకు గొల్లు పాలెం గ్రామంలో జనరిక్ మందుల షాపు త్వరలో నెలకొల్పనున్నామని తెలిపారు. అలానే రైతులు రుణా లు పొందేందుకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించామ ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ జేడీ డా.ఎన్.దామోదరరావు, ఏడీ డా.అనూరాధ, ఏఎం సీ ఉపాధ్యక్షులు కొరాడ కృష్ణ, టీడీపీ మండల అధ్యక్షు డు రాపాక అచ్చంనాయుడు, సర్పంచ్ నడుపూరి భా స్కరనాయుడు, కర్రోతు శ్రీనివాసరావు, పాచల సీతా రాం, ఈదుబిల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.