Rules Must Be Followed నిబంధనలు పాటించాల్సిందే..
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:51 PM
Rules Must Be Followed ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని డ్వామా పీడీ రామచంద్రరావు హెచ్చరిం చారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
గరుగుబిల్లి, ఫిబ్రవరి19(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని డ్వామా పీడీ రామచంద్రరావు హెచ్చరిం చారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పంచాయతీల పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను శనివారంలోగా ప్రారంభించాలని.. లేకుంటే రద్దయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పంచాయతీరాజ్, ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖల అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామన్నారు. జిల్లాలో బీటీ, సీసీ రహదారుల నిర్మాణాలకు రూ.148 కోట్ల మేర ఉపాధి నిధులు మంజూరు చేశామని, ఇప్పటివరకు రూ. 70 కోట్లు ఖర్చయినట్లు వివరించారు. అభివృద్ధి పనులు మార్చి 10లోగా పూర్తి చేయాలన్నారు. రహదారులు, డ్రైనేజీల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూచించారు. సమయం దాటితే చెల్లింపులు జరగవన్నారు. పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు ఫిర్యాదులొస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయకుంటే సిబ్బందిపై వేటు తప్పదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచా యతీరాజ్ శాఖ డీఈఈ ఎన్.వెంకటరావు, ఎంపీడీవో జి.పైడితల్లి, ఐటీడీఏ జేఈ డి.గౌరునాయుడు, ఏపీవో ఈశ్వరమ్మ, జేఈలు పాల్గొన్నారు.