ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:09 AM
ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందా డు.
యువకుడి మృతి
కొత్తవలస, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందా డు. ఈ ఘటన తుమ్మికాపల్లి పంచాయతీ కొత్తవలస-ఎస్.కోట రహదారిలోని నూకాలమ్మ గుడి వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీనిపై ఎస్‌ఐ జోగారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస పంచాయతీ కొత్తవలస సంత మార్కెట్‌కు చెందిన బోని వెంకటేష్(33) ఆదివారం తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై ఎస్.కోట వైపు వెళ్తుండగా.. దేవరాపల్లి నుంచి కొత్తవలస వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వెంకటేష్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్‌కు ఇంకా వివాహం కాలేదు. వెంకటేష్ తండ్రి మరిడిబాబు, తల్లి కనకదుర్గ రోజువారీ కూలీలుగా పనిచేస్తు న్నారు. రెండు గంటల ముందు వరకూ తమతోనే కలిసి ఉన్న కొడుకు ఇంతలోనే మృతిచెందడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంకటేష్ అన్న శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జోగారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట తరలించారు.