Share News

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:11 AM

స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపం లో జాతీయ రహదారిపై సోమవారం ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

  • పలువురికి గాయాలు

గజపతినగరం, మార్చి 2(ఆంధ్రజ్యో తి): స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపం లో జాతీయ రహదారిపై సోమవారం ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయు డు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సబ్‌స్టేషన్‌ వద్ద పోలీసులు ఏర్పాటుచేసిన బీట్‌ వద్ద ఓ లారీ ఒక్కసారిగా ఆగింది. అదే సమయంలో సాలూరు నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఈ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మందికి గాయాలయ్యాయి. గజపతినగరం మండలం సీతారా మపురం గ్రామానికి చెందిన యస్వంత్‌, విజయనగరానికి చెందిన సాయి కృష్ణం రాజు తీవ్రంగా గాయపడ్డారు. సాలూరుకు చెందిన విద్య, నిర్మల, కోస్టువలసకు చెందిన కోట సీతయ్య, కోట వాసు, ఆరికతోటకు చెందిన కోట రమ, కోట లక్ష్మి, సీహెచ్‌ ఉషారాణి, బి.పావని తోపాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి, ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతిన్నది. క్షతగాత్రులను ప్రథమచికిత్స అనంతరం వారి గమ్యస్థానాలకు చేర్పించామని ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Mar 03 , 2026 | 12:11 AM