Share News

రూ.20 లక్షల గోల్‌మాల్‌

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:07 AM

మండలంలో చేపట్టిన ఉపాధి హామీ పనులకు సంబంధిం చి మూడు క్లస్లర్లలో రూ.20 లక్షల వరకు నిధులు గోల్‌మాల్‌ అయినట్టు డీఆర్‌పీలు దుర్గాప్రసాద్‌, కృష్ణప్రసాద్‌, రాములు వెల్లడించారు.

రూ.20 లక్షల గోల్‌మాల్‌
మాట్లాడుతున్న ఏపీడీ రమాదేవి

బాడంగి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): మండలంలో చేపట్టిన ఉపాధి హామీ పనులకు సంబంధిం చి మూడు క్లస్లర్లలో రూ.20 లక్షల వరకు నిధులు గోల్‌మాల్‌ అయినట్టు డీఆర్‌పీలు దుర్గాప్రసాద్‌, కృష్ణప్రసాద్‌, రాములు వెల్లడించారు. బుధవారం స్థానిక మం డల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో వారు మాట్లాడా రు. అధికంగా మస్తర్ల దిద్దుబాట్లు, సంతకాలు ఫోర్జరీలు, కొలతల తేడాలు ఉండడంతో పాటు వాడాడలో రూ.30 వేల మొక్కలు నాటినట్టు రికార్డులలో చూపినప్పటికీ క్షేత్రస్థాయిలో మొక్కలు లేవన్నారు. ఆకులకట్ట, ఆనవరం, గూడెపువలస, వాడాడ, కోటిపల్లి, రేజేరు, పినపెంకి, పి.వెంకంపేట పరిధిలో రూ.6 లక్షలపైనే రికవరీ చేయాల్సి ఉందన్నారు. భీమవరం, ముగడ, పాల్తేరు, బాడంగి, లక్ష్మీపురం, పిన్నవలస గ్రామాల్లో వారానికి ఒకసారి మాత్రమే సంతకాలు తీసుకోవడం, కొలతల తేడాలు చూపించి సుమారు రూ.6.50 లక్షల వరకు అధికంగా బిల్లులు నమోదు చేసినట్టు గుర్తించామన్నారు. బాడంగి, కోడూరులో 50 శాతం పనులు కూడా జరగలేదన్నారు. దీంతో ఏపీడీ రమాదేవి బాడంగి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సుధారాణిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. అలాగే బొత్సవానివలస, డొంకినవలస, గజరాయనివలస, గొల్లాది, మల్లం పేట, పెదపల్లి, పిండ్రంగివలస, పూడివలస, తెంటువలస, వీరసాగరం గ్రా మాల్లో కూడా కొలతల తేడాలు, మస్తర్లలో ఫోర్జరీలు, దిద్దుబాట్లు ఉన్నట్టు గుర్తించామన్నారు. రూ.7 లక్షలపైగా రికవరీ చేయాల్సి ఉందన్నారు. మొత్తం రూ.20 లక్షలు రికవరీకి ఆదేశించారు. ప్రజావేదికలో ఏపీడీ చంద్రకుమారి, ఎస్‌ఆర్‌పీ ఎం.తిరుపతిరావు, ఏపీవో సాయిరాం పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 01:07 AM