Share News

జలజీవన్‌ మిషన్‌ ద్వారా రూ.95.80 కోట్లు విడుదల

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:09 AM

నియోజకవర్గం లోని ఐదు మండ లాల ప్రజల దాహార్తిని తీర్చేం దుకు జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రభుత్వం రూ.95.80 కోట్లు విడుదల చేసిందని ఎమ్మెల్యే లలితకుమారి, టీడీపీ రాష్ట్ర నాయకుడు కేబీఏ రాంప్రసాద్‌ తెలిపారు.

జలజీవన్‌ మిషన్‌ ద్వారా రూ.95.80 కోట్లు విడుదల

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి

లక్కవరపుకోట, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం లోని ఐదు మండ లాల ప్రజల దాహార్తిని తీర్చేం దుకు జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రభుత్వం రూ.95.80 కోట్లు విడుదల చేసిందని ఎమ్మెల్యే లలితకుమారి, టీడీపీ రాష్ట్ర నాయకుడు కేబీఏ రాంప్రసాద్‌ తెలిపారు. శనివారం ఎల్‌.కోటలోని తమ నివాసం వద్ద నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 13,252 తాగు నీటి పథకాల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.4వేల 53 కోట్ల 85 లక్షల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. ఇందులో 5 ప్రధాన మల్టీ విలేజ్‌ స్కీములు, 13,247 సింగిల్‌ విలేజ్‌ స్కీములు ఉన్నాయని చెప్పారు. వీటిలో 7,439 గ్రామాల్లో సమగ్ర తాగునీటి పథకాలుగా పునర్వవ్యస్థీకరణ జరుగుతోందన్నారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో 135 పంచాయతీలు 296 శివారు గ్రామాల్లో పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు లభించినట్లు తెలిపారు. వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబుకు, లోకేశ్‌కు, పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కరెడ్ల ఈశ్వరరావు, ఏఎంసీ చైర్మన్‌ చొక్కాకుల మల్లునాయుడు, కొట్యాడ ఈశ్వరరావు, అక్కిరెడ్డి రమణ, కొట్యాడ రాముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 12:09 AM