Share News

57 మందికి రూ.40.42 లక్షలు

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:07 AM

ష్టాల్లో ఉన్నవారిని పార్టీలకు అతీతంగా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతీ కుటుంబానికి పెద్దకొడుకు మాదిరిగా అండగా నిలుస్తానని ఇచ్చిన మాటను చంద్రబాబు పాటిస్తున్నారని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.

57 మందికి రూ.40.42 లక్షలు
లబ్ధిదారులతో ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్‌ లక్ష్మునాయుడు

బొబ్బిలి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కష్టాల్లో ఉన్నవారిని పార్టీలకు అతీతంగా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతీ కుటుంబానికి పెద్దకొడుకు మాదిరిగా అండగా నిలుస్తానని ఇచ్చిన మాటను చంద్రబాబు పాటిస్తున్నారని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన 57 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.40.42,368 చెక్కులను సోమవారం స్థానిక కోటలో పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారుల పార్టీ చూడకుండా ఆపద కాలంలో వారికి సహాయం అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు మాజీ ఎమ్మెల్యే, బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ ప్రజాసేవలో ఎమ్మెల్యే బేబీనాయన తరిస్తున్నారన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ కోసం ఫైల్స్‌ తయారు చేయడంలో ప్రతిభ చాటుకున్న కోట ఉద్యోగి మజ్జి కృష్ణను అభినందించారు. ఈ సందర్భంగా వారంతా థ్యాంక్యూ సీఎం సార్‌ అంటూ లబ్ధిదారులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు, పట్టణ, మండల టీడీపీ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, వాసిరెడ్డి సత్యనారా యణ, బాడంగి వైస్‌ ఎంపీపీ పాలవలస గౌరు, సీనియర్‌ నాయకులు మడక తిరుపతినాయుడు, జగన్నాథంనాయుడు, అడ్డా గోవిందరాజు, కాకల వెంకటరావు, వెలగాడ హైమావతి, వాలేటి తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 12:07 AM