Share News

ఏటీఎం కార్డుతో రూ.13 వేలు మాయం

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:14 AM

ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసి ఇవ్వమని కోరినందుకు రూ.13 వేలు కాజేశాడో వ్యక్తి.

ఏటీఎం కార్డుతో రూ.13 వేలు మాయం

కొత్తవలస, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసి ఇవ్వమని కోరినందుకు రూ.13 వేలు కాజేశాడో వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విశాఖపట్టణం జిల్లా ఆనందపురం మండలం కోలవానిపాలెం గ్రామానికి చెందిన సియ్యాద్రి శ్రీను గురువారం కొత్తవలస ఎస్‌బీఐ వద్దనున్న ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చాడు. తనకు ఏటీఎం ద్వారా డబ్బులు తీయడం రాకపోవడంతో పక్కనే ఉన్న గుర్తు తెలియని వ్యక్తికి పిన్‌ నెంబరు చెప్పి డబ్బులు తీయాలని కోరారు. మూడు దఫాలుగా రూ.40 వేలను తీసి... శ్రీనుకు ఏటీఎం కార్డు ఇవ్వడంతో శ్రీను డబ్బులు పట్టుకుని వెళ్లి పోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికే మరో రూ.13 వేలు డ్రా చేసినట్టు మెసేజ్‌ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి సియ్యాద్రి శ్రీనుకు ఇచ్చిన ఏటీఎం కార్డు కాకుండా వేరే కార్డు ఇచ్చాడు. ఆ విషయం గమనించకపోవడంతో శ్రీను ఏటీఎం కార్డుతో ఆ వ్యక్తి మరో రూ.13 వేలు తీసుకున్నాడు. తాను మోసపోయినట్టు గుర్తించిన శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 24 , 2026 | 12:14 AM