గురజాడ గృహం పునరుద్ధరణకు రూ.12 లక్షలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:07 AM
తెలుగుజాతికి గర్వకారణమైన ప్రముఖ సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ వెంకట అప్పారావు గృహాన్ని సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి.. దాని పరిరక్షణకు ప్రభు త్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివా సరావు చెప్పారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం కల్చరల్, జనవరి 2 (ఆంధ్ర జ్యోతి): తెలుగుజాతికి గర్వకారణమైన ప్రముఖ సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ వెంకట అప్పారావు గృహాన్ని సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి.. దాని పరిరక్షణకు ప్రభు త్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివా సరావు చెప్పారు. గురజాడ గృహాన్ని పునరు ద్ధరించేం దుకు రూ.12 లక్షల 5 వేలు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ చరిత్రాత్మక గృహానికి తగిన రక్షణ లేక... ఆకతాయిలు పాడు చేస్తున్నారని గురజా డ వారసులు వెంకట ప్రసాద్, ఇందిర దంప తులు గత నెల 25న తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. దీనిపై తాను వెంటనే స్పందించి కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, నగర పాలక సంస్థ కమిష నర్ నల్లనయ్యలతో చర్చించినట్టు చెప్పారు. ఇంజనీరింగ్ అధికారులు గృహాన్ని పరిశీలించి అంచనాలు రూపొందించారని తెలిపారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయ్యిందని వివరించారు. ఈ నిధులతో మరుగుదొడ్లు, పై కప్పునకు మరమ్మతులు చేపట్టడంతో పాటు రంగులు వేయిస్తామని మంత్రి వెల్లడించారు.