Share News

బెదిరింపుల కేసులో రౌడీషీటర్‌కు రిమాండ్‌

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:02 AM

బెదిరింపుల కేసులో ఓ రౌడీషీటర్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ స్థానిక న్యాయాధికారి తీర్పు వెలువరించారు.

బెదిరింపుల కేసులో రౌడీషీటర్‌కు రిమాండ్‌

రాజాం రూరల్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): బెదిరింపుల కేసులో ఓ రౌడీషీటర్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ స్థానిక న్యాయాధికారి తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి రాజాం టౌన్‌ సీఐ నవీన్‌కుమార్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. రాజాం పట్టణానికి చెందిన రౌడీషీటర్‌ పడాల శేఖర్‌ ఈనెల 18న స్థాని క అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద ఉన్న పెట్రోల్‌బంక్‌కు ఆటోతో వెళ్లాడు. ఆటోలో రూ.200 డీజిల్‌ వెయ్యమన్నాడు. బంక్‌లో బాయ్‌గా పనిచేస్తున్న యందవ రామ్‌ కుమార్‌ డబ్బులు అడిగాడు. ‘నేను రౌడీషీటర్‌ను.. నా గురించి తెలియదా.. నన్నే డబ్బులు అడుగుతావా.. నిన్ను అంతం చేస్తాను. బయట కనిపిస్తే చంపేస్తా’ అని బెదిరించి, పంప్‌బాయ్‌లో భయాన్ని కలిగించి, బలవంతంగా ఆటోలో రూ.200 డీజిల్‌ పోయించుకున్నాడు. చంపేస్తానని హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయా డు. యందవ రామ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాం టౌన్‌ సీఐ డి.నవీన్‌ కుమార్‌ రంగంలోకి దిగారు. బంక్‌లో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితు డ్ని గుర్తించారు. మంగళవారం శేఖర్‌ను అదుపులోనికి తీసుకుని కోర్టులో ప్రవేశపె ట్టారు. ఆగస్టు 3 వరకూ శేఖర్‌కు న్యాయాధికారి రిమాండ్‌ విధిస్తూ తీర్పునిచ్చారు.

Updated Date - Jul 22 , 2026 | 12:02 AM