రాజాంలో రౌడీషీటర్ అరెస్టు
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:17 AM
మద్యం ఇవ్వకపోతే చంపేస్తానని ఓ ఇద్దరిని బెదిరించిన రౌడీషీటర్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.
రాజాం రూరల్, జూలై 27(ఆంధ్రజ్యోతి): మద్యం ఇవ్వకపోతే చంపేస్తానని ఓ ఇద్దరిని బెదిరించిన రౌడీషీటర్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటన రాజాంలో సోమవారం చోటుచేసుకుంది. సోమవారం రాజాం టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌ఐ మహమ్మద్ సల్మాన్ బేగ్‌తో కలిసి సీఐ డి.నవీన్‌కుమార్ ఈ కేసుకు సంబంధిం చిన వివరాలను వెల్లడించారు. కంచరాం గ్రామానికి చెందిన లావేటి రవిమోహన్ ఈనెల 25న ఫైర్‌స్టేషన్ వెనుక ఉన్న మామిడితోటలో స్నేహితుడి రౌతు రామ సుందర్‌తో కలిసి మద్యం తాగుతున్నాడు. ఇదే సమయంలో అక్కడికి చేరకున్న దేవరాజ్ అలియాస్ దేవా.. తనకు మద్యం ఇప్పించాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన రామ్మోహన్ మద్య షాపు నుంచి మద్యం తీసుకువచ్చి దేవాకు ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా రవిమోహన్ వద్ద ఉన్న వెయ్యి రూపాయలను, అతని స్నేహితుడు వద్ద నుంచి మొబైల్‌ను బలవం తంగా తీసుకున్నాడు. దీంతో రవిమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమే రకు సోమవారం దేవాను పోలీసులు అదుపులోనికి తీసుకుని, కోర్టులో ప్రవేశపె ట్టారు. ఇతనిపై ఇప్పటికే మూడు కేసులున్నాయని సీఐ తెలిపారు.