హత్యాయత్నం కేసులో రౌడీ షీటర్ అరెస్టు
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:35 AM
హత్యాయత్నం కేసులో రాజాపులోవ గ్రామానికి చెందిన కిలారి శ్రీను అలియాస్ డీజే శ్రీను అనే రౌడీ షీటర్‌ను అరెస్టు చేసినట్టు సీఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపారు.
భోగాపురం, సెప్టెంబరు 11(ఆం ధ్రజ్యోతి): హత్యాయత్నం కేసులో రాజాపులోవ గ్రామానికి చెందిన కిలారి శ్రీను అలియాస్ డీజే శ్రీను అనే రౌడీ షీటర్‌ను అరెస్టు చేసినట్టు సీఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసుకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీను తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈనెల 5న అర్ధరాత్రి మహారాజపేట సమీపంలో గల టీ దుకాణానికి వెళ్లారు. అక్కడ ఓటర్ బాటిల్ తీసుకొని, టీ తాగారు. అనంతరం డబ్బులు చెల్లించాలని దుకాణ నిర్వాహ డు రాజాపులోవ గ్రామానికి చెందిన రుద్ర అప్పలనాయుడు అడగ్గా.. డబ్బులు తర్వాత ఇస్తానులే అని డీజే శ్రీను సమాధానం ఇచ్చాడు. గతంలో బాకీ ఉందని, ఈ బాకీతో కలిపి ఇప్పుడే చెల్లించాలని దుకాణదారుడు పట్టుబట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈక్రమంలో శ్రీను ఆగ్రహంతో తన దగ్గర ఉన్న కత్తితో అప్పలనాయుడి కడుపులో పొడిచాడు. అనంతరం శ్రీను అక్కడ నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు అప్పలనాయుడును తగరపువలస ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ దుర్గాప్రసాదరావు సూచనలతో ఎస్‌ఐ ఎల్.దామోదరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. శ్రీను ఈనెల 11వ తేదీన ఉదయం లింగాలవలస సమీ పంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే వెళ్లి, పట్టుకున్నారు. విచారణలో హత్యకు పాల్పడినట్లు అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. రౌడీషీటర్ అయిన శ్రీనుపై విశాఖ జిల్లా భీమిలి పోలీస్‌స్టేషన్‌లో 6, డెంకాడ పోలీస్‌స్టేషన్‌లో 2, భోగాపురం పోలీస్‌స్టేషన్‌లో 2 కేసులతో పాటు రౌడీషీటు ఉంది. రౌడీషీటర్‌ను పట్టుకోవడంలో శ్రమించిన పోలీ స్ సిబ్బందిని సీఐ దుర్గాప్రసాదరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు దామోదరరావు, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.