ఉపాధ్యాయుడిపై రౌడీషీట్
ABN , Publish Date - May 23 , 2026 | 12:29 AM
పున్నపురెడ్డిపేట గ్రామానికి చెందిన ఉపాధ్యాయు డు పి.రామారావుతో పాటు మరో ముగ్గురిపై రౌడీషీట్ తెరిచినట్టు ఎస్‌ఐ నారా యణరావు శుక్రవారం విలేకర్లకు తెలిపారు.
గుర్ల, మే 22(ఆంధ్రజ్యోతి): పున్నపురెడ్డిపేట గ్రామానికి చెందిన ఉపాధ్యాయు డు పి.రామారావుతో పాటు మరో ముగ్గురిపై రౌడీషీట్ తెరిచినట్టు ఎస్‌ఐ నారా యణరావు శుక్రవారం విలేకర్లకు తెలిపారు. 2001లో పున్నపురెడ్డిపేటకు చెందిన ప్రసాదు అనే యువకుడు హత్య కేసులో రామారావుతో పాటు అదే గ్రామానికి చెందిన పి.సీతమ్మ, సత్యం, వీరి మేనల్లుడు రాంబాబుపై అప్పట్లో కేసు నమోదు చేశారు. వీరంతా అప్పట్లో కొంతకాలం శిక్ష అనుభవించారు. అప్పట్లో రామారావుని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈనేపథ్యంలో ఆయనతో పాటు ముగ్గురు నింది తులపై అప్పట్లో రౌడీషీట్ తెరిచారు. అయితే కొంతకాలం రాజకీయ నాయకుల పలుకుబడితో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తెలిసింది. తర్వాత కొంత మంది ఒత్తిడి వల్ల ఈ విషయం బయటకు తెలిసింది. సమగ్ర విచారణ చేసిన తర్వాత పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. రామారావు ప్రస్తుతం జమ్ముపే ట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.