నేర విచారణలో ఫోరెన్సిక్ సైన్స్ పాత్ర కీలకం: ఎస్పీ
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:03 AM
నేరస్థులకు సరైన శిక్షలు పడాలంటే పోలీసులు బలమైన సాక్ష్యాలను సేక రించాలని.. దీనిలో క్లూస్ టీం, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల పాత్ర ఎంతో కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు.
నెల్లిమర్ల, జూన్ 27(ఆంధ్రజ్యోతి): నేరస్థులకు సరైన శిక్షలు పడాలంటే పోలీసులు బలమైన సాక్ష్యాలను సేక రించాలని.. దీనిలో క్లూస్ టీం, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల పాత్ర ఎంతో కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. శనివారం స్థానిక సెంచూరియన్ విశ్వవిద్యాలయం లో ‘నేర విచారణలో ఫోరెన్సిక్ సైన్స్ పాత్ర’ అనే అం శంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ప్రస్తుతం సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. వాటికి సాక్ష్యాలు సేకరించడం తలకు మించిన భారంగా మారిందన్నారు. త్వరలో విశాఖలో స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ (ఎఫ్‌ఎస్‌ఎల్) ల్యాబ్ ఏర్పాటు కానుందని ఎస్పీ వెల్లడించారు. శ్రీకాకు ళం గానీ విజయనగరంలో గానీ మారో ల్యాబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపారు. వీసీ ప్రశాంతకుమార్ మహంతి మాట్లాడుతూ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో విశ్వవిద్యా లయం తోడ్పడగలదన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరెన్సిక్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కేవీ రవికుమార్, రిజిస్ట్రార్ పి.పల్లవి, టిగ్మాంశు పట్నాయక్, నాగజోగయ్య, లక్ష్మీకాం త్ సుతార్, ఉత్పల్ త్రిపాఠి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఎం.ఖజానారావు, అడిషనల్ పీపీ జి.స త్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల కు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డీఎస్పీ ఎస్.రాఘవు లు పాల్గొన్నారు.