Road Accidents రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:17 AM
Robust Measures to Prevent Road Accidents జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డితో కలిసి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
పార్వతీపురం, జూన్10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డితో కలిసి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ప్రతి సమావేశానికి జిల్లాలో ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టాలన్నారు. రహదారి భద్రతకు సంబంధించి ప్రతి ప్రభుత్వ శాఖకు బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలిపారు. ఆయా శాఖలు తీసుకున్న చర్యలు నివేదికతోనే తదుపరి సమావేశానికి హాజరుకావాలన్నారు. ఘాట్‌రోడ్లు, మలుపుల వద్ద ప్రమాదాలు జరిగే స్థలాలు గుర్తించాలని, రేడియం స్టిక్కర్లు , హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రవాణాశాఖధికారి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
17 నాటికి ఎంపీ ల్యాడ్స్ పనులు పూర్తిచేయాలి
జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపడుతున్న పనులను ఈ నెల 17 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షమం, గ్రామీణ నీటి సరఫరా విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న భివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. రహదారులు, బస్సు షెల్టర్లు, సామాజిక భవనాలు, రచ్చబండ, గ్రావెల్ రోడ్లు నిర్మాణాలన్నీ నాణ్యతతో చేపట్టాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి జేసీ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.