ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:46 AM
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు.
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్
విజయనగరం, కలెక్టరేట్, అక్టోబరు 21(ఆంధ్రజ్యో తి): జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదే శించారు. బుధవారం రాత్రి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకర ణకు మరో రెండు రోజులు సమయం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు, సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని ఆయ న సూచించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను ప్రచురించి, ధ్రువీకరించిన అనంతరం ఎన్నికల గుర్తులతో కూడిన జాబితాను ముద్రణకు పంపించాలన్నారు. రెండు, మూడు రోజు ల్లో ముద్రణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నగర పాలక సంస్థలో పోలింగ్ తేదీ మారిన నేపథ్యం లో మార్పులకు అనుగుణంగా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఓటర్ల లెక్కింపు కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు ముందుగా చేయాలని సూచించారు. లోపాలకు తావు లేకుండా నిర్దేశించిన గడువులో అన్ని ఏర్నాట్లను పూర్తి చేయాలన్నారు. కాన్ఫెరెన్స్ లో డీఆర్వో సత్తిబాబు, ఎంపీడీవోలు ఉన్నారు.
కౌంటింగ్ కేంద్రం పరిశీలన
ఎస్.కోట రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో భాగంగా ఎస్.కోట, వేపాడ, లక్క వరపుకోట, కొత్తవలస మండలాలకు సంబంధించి నవంబరు 3న ఎన్నికలు జరిగిన తర్వాత నవంబరు 5న నిర్వహించే ఓట్లు లెక్కింపు ప్రక్రియకు మండలం లోని భవానీనగర్ డా.వరలక్ష్మి పాఠశాలను ఎంపిక చేశారు. ఈనేపథ్యంలో ఈ కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి బుధవారం సాయంత్రం పరిశీ లించారు. ఈసందర్భంగా పాఠశాలను పూర్తి స్థాయి లో పరిశీలించిన అనంతరం ఆర్డీవో సుధాసాగర్ మండలశాఖ అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి భద్రపరిచే విధానంపై, ఓట్లు లెక్కించే సమయంలో మౌలిక సదు పాయాలపై ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు.