Road Works గడువులోగా రోడ్ల పనులు పూర్తిచేయాలి
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:12 AM
Road Works Must Be Completed Within the Deadline గడువులోగా ఏజెన్సీ ప్రాంత రహదారి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పిం చాలనే లక్ష్యంతో చేపడుతున్న రహదారి పనులపై నిర్లక్ష్యం పనికిరాదన్నారు. మెటీరియల్ సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని, త్వరితగతిన నిర్మాణాల పూర్తికి అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు.
పార్వతీపురం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): గడువులోగా ఏజెన్సీ ప్రాంత రహదారి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పిం చాలనే లక్ష్యంతో చేపడుతున్న రహదారి పనులపై నిర్లక్ష్యం పనికిరాదన్నారు. మెటీరియల్ సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని, త్వరితగతిన నిర్మాణాల పూర్తికి అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. వచ్చే నెల పదో తేదీలోపు అన్ని పనులు పూర్తిచేయాలన్నారు. ప్రతిరోజూ వాటి పురోగతిని తెలిపే ఫొటోలు, నివేదికలను తమకు అందజేయాలని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
- పీఎం ఇంటర్న్‌షిప్‌తో జిల్లాలోని నిరుద్యోగ యువత తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన యువతకు ప్రతి నెలా రూ.9 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. విధుల్లో చేరిన వెంటనే ఒకేసారి రూ.6 వేలు జాయినింగ్ గ్రాంట్‌గా అందిస్తుందని వెల్లడించారు. పదో తరగతి, ఐటీఐ , డిప్లొమో లేదా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 25 సంవత్సరాల లోపు నిరుద్యోగ అభ్యర్థులు అర్హులని తెలిపారు.