Share News

రహదారుల పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:12 PM

డోలీ రహిత జిల్లాగా మార్చేందుకు పలు గ్రామాల్లో చేపడుతున్న రహదారుల పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

రహదారుల పనులు పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): డోలీ రహిత జిల్లాగా మార్చేందుకు పలు గ్రామాల్లో చేపడుతున్న రహదారుల పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లు నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లుకు తావులేకుండా నాణ్యత, పారదర్శకతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 81 రోడ్లు మంజూరు చేశామని, ఇప్పటివరకు 50 గ్రౌండింగ్‌ అయ్యాయని, మిగిలిన పనులు కూడా ప్రారంభించాలని ఆదేశించారు. బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈ నెలాఖరులోగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా ఈఈలు, ఏఈలు బాధ్యత వహించాలన్నారు. ఈఈలు క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీ చేయాలన్నారు. పనులకు సంబంధించి ఫొటోలను తప్పనిసరిగా తీయాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సబ్‌కలెక్టర్లు ఆర్‌.వైశాలి, పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డ్వామా పీడీ కె.రామచం ద్రరావు, ఈఈలు, ఏఈలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 11:12 PM