Share News

Road on the tank bund leading to private land ప్రైవేటు స్థలానికి చెరువు గట్టుపై రోడ్డు

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:10 AM

Road on the tank bund leading to private land ముషిడిపల్లి గ్రామంలో ఓ వైసీపీ నేత దగ్గరుండి చెరువు గట్టుపై నుంచి రహదారి వేసేశాడు. విస్తుపోయిన గ్రామ యువకులు విషయాన్ని అధికారులు, మీడియా దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖకు చెందిన ఓ వ్యక్తి చెరువు చివర స్థలం కొన్నాడు. అక్కడకు చేరుకోవడానికి రోడ్డుకావాలని వైసీపీ నేతను కోరాడు. దీనికి పరిష్కారంగా ఆ నేత గ్రామంలో వున్న ఎర్రచెరువు గట్టును ఒక్కరోజులో రహదారిగా మార్చేశాడు.

Road on the tank bund leading to private land ప్రైవేటు స్థలానికి   చెరువు గట్టుపై రోడ్డు
ఎర్రచెరువును రోడ్డుగా మార్చినట్లు చూపిస్తున్న గ్రామస్థుడు గంగరాజు

ప్రైవేటు స్థలానికి

చెరువు గట్టుపై రోడ్డు

వైసీపీ నేత దుశ్చర్య

ఎస్‌.కోట రూరల్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి):

ముషిడిపల్లి గ్రామంలో ఓ వైసీపీ నేత దగ్గరుండి చెరువు గట్టుపై నుంచి రహదారి వేసేశాడు. విస్తుపోయిన గ్రామ యువకులు విషయాన్ని అధికారులు, మీడియా దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖకు చెందిన ఓ వ్యక్తి చెరువు చివర స్థలం కొన్నాడు. అక్కడకు చేరుకోవడానికి రోడ్డుకావాలని వైసీపీ నేతను కోరాడు. దీనికి పరిష్కారంగా ఆ నేత గ్రామంలో వున్న ఎర్రచెరువు గట్టును ఒక్కరోజులో రహదారిగా మార్చేశాడు. ఈ తంతు ఆదివారం జరిగింది. దీనిపై సోమవారం ఉదయం స్థానికులు అధికారులకు తెలియజేశారు. ఎవరూ అడ్డుకోలేరన్న బరితెగింపుతో ఈ పని చేశాడని ఆరోపించారు. ఈవిషయంపై పంచాయతీ వీఆర్‌వో నాయుడును వివరణ కోరగా ఈవిషయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే పరిశీలించి అక్కడ భూమి కొన్న వ్యక్తితో మాట్లాడామని అన్నారు. తనకు తెలియక చేశానని, మళ్లీ మాములుగా తయారు చేస్తామని తెలిపాడన్నారు. ఒక్కరోజు వ్యవధి చూసి చెరువు గట్టును యాథాతధంగా మార్చకపోతే చర్యల కోసం తహసీల్దార్‌కు సిఫార్సు చేస్తానన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 12:10 AM