అభివృద్ధి కోసమే రోడ్డు విస్తరణ
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:57 PM
ప్రజాభివృద్ధి కోసమే మక్కువలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
- మంత్రి సంధ్యారాణి
- మక్కువ రహదారి పనుల పరిశీలన
మక్కువరూరల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాభివృద్ధి కోసమే మక్కువలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మక్కువలో ఇటీవల కత్తిదాడికి గురైన టీడీపీ సీనియర్ నాయకుడు, క్లస్టర్ ఇన్‌చార్జి పి.మల్లేశ్వరావును శనివారం ఆమె పరామర్శించారు. దాడికి గల కారణాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిందితులు ఎంతటివారైనా క్షమించవద్దని, సమగ్రంగా దర్యాప్తు చేసి దాడివెనుక ఎవరున్నారో తెలుసుకొని వెంటనే వారిని కూడా అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం మక్కు వలో జరుగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ.2.65కోట్లతో మక్కువలో రోడ్డు విస్తరణ పనులు చేప డుతున్నట్లు తెలిపారు. భవిష్య త్‌ను దృష్టిలో పెట్టుకొని 80 అడుగుల మేర విస్తరిస్తున్నట్లు చెప్పారు. వ్యాపారు లకు ఎటువంటి నష్టం జరగకుండా చూస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాలనాయుడు, సాలూరు టౌన్ టీడీపీ అధ్యక్షుడు నిచ్చాది చిట్టిబాబు, నాయకులు ఆముదాల పరమేశ్వరావు, గూడేపు యుగంధర్, మత్సశ్యామ్ సుం దరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
-మక్కువ జడ్పీటీసీ సభ్యుడు మావుడి శ్రీనివాసరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని మక్కువకు గొర్లె అనం త అనే యువకుడు మంత్రి సంధ్యారాణికి ఫిర్యాదు చేశాడు. శుక్రవారం నాయుడువీధిలో తాను ద్విచక్ర వా హనంపై వెళ్తుండగా జడ్పీటీసీ తన కారుతో వెనుక నుం చి ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడని అనంత తెలిపాడు.
- మక్కువ రోడ్డు పనులను మంత్రి పరిశీలిస్తుండగా ఆ మార్గంలో ఆర్టీసీ బస్సు ఉండడాన్ని గమినించి ఆమె అక్కడకు వెళ్లారు. బస్సులో ఉన్న ఉపాధి వేతనదారులతో మాట్లాడారు. ఉచిత బస్సు సాధారణ ప్రయాణాలకే కాకుండా మండుటెండలో ఉపాధి పనులకు వెళ్లే మహిళా కూలీలకు కూడా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.