రూ.18 కోట్లతో రోడ్ల అభివృద్ధి: ఎమ్మెల్యే అదితి
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:01 AM
విజయనగరం నియోజక వర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.18.39 కోట్లు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు. గురువారం తన కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
విజయనగరం రూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): విజయనగరం నియోజక వర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.18.39 కోట్లు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు. గురువారం తన కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో రహదారుల అభి వృద్దికి ఎంతెంత నిధులు అవసరమనే విషయమై ఆమె అఽధికారులతో చర్చించారు. రోడ్డు పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని.. ముందుకు సాగాలని సూచించారు. పనుల నాణ్యతో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.