Share News

రూ.4.52 కోట్లతో రహదారుల అభివృద్ధి

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:10 AM

చీపురుపల్లి మండలంలోని ప్రధాన రహదారులను రూ.4.52 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు.

రూ.4.52 కోట్లతో రహదారుల అభివృద్ధి

  • చీపురుపల్లి ఎమ్మెల్యే కళా

చీపురుపల్లి, అక్టోబరు 3(ఆంధ్రజ్యో తి): చీపురుపల్లి మండలంలోని ప్రధాన రహదారులను రూ.4.52 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. పల్లె పండుగ 3.0లో భాగంగా పత్తికాయవలస, ముగిది పేట రోడ్డు పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకుపాలేం రోడ్డుకు రూ.105 లక్షలు, పెదనడిపల్లికి రూ.202 లక్షలు, పత్తికాయవలస, ముగిదిపేటకు రూ.105 లక్షలు కేటాయించామని తెలిపారు.

టీడీపీలో చేరిక

పత్తికాయవలసలో వైసీపీకి చెందిన 50 కుటుంబాలు శనివారం ఆ పార్టీని విడిచి టీడీపీలో చేరాయి. వీరికి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెస్కో మాజీ చైర్మన్‌ దన్నాన రామచంద్రుడు, టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడు, పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనా యుడు, మీసాల సిమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:10 AM