రోడ్ల నిర్మాణంపై చర్యలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:04 AM
ee
పాలకొండ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రోడ్ల నిర్మాణానికి కూట మి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నగర పంచాయతీలోని గారమ్మకాలనీ, ఇందిరానగర్‌కాలనీ, గాయత్రీనగర్, నవోదయనగర్, లోగిడివీధిలో రూ.కోటి 50 లక్షల తో పలు రోడ్లకు శంకుసాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టణాలతోపాటు గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి పెద్దఎత్తున ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ అరకు పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి గంటా సంతోష్‌కుమార్, తూర్పుకాపు కార్పొరేషన్ డైరె క్టర్ గర్భాన సత్తిబాబు, నాయకులు పల్లా కొండలరావు, రాజేష్, అడపా బాబ్జీ, వెంకటరమణ, నారాయణరావు, సుంకరి అనీల్‌దత్, శ్రీనివాసరావు, జవరాజు, రమణ పాల్గొన్నారు.