పోలిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:22 AM
అప్పుడే తనిఖీ కోసం బస్సును నిలుపుదల చేశారు.. అదే సమయంలో టైర్లలో గాలి పరిశీలించేందుకు డ్రైవర్ కిందకు దిగాడు.. ఇంతలో వెనుక నుంచి ఓ లారీ వచ్చి బస్సును బలంగా ఢీకొంది.
తనిఖీ కోసం నిలిపిన బస్సును ఢీకొన్న లారీ
డ్రైవర్ మృతి.. నలుగురికి గాయాలు
ప్రాణాలతో బయటపడ్డ మిగతా ప్రయాణికులు
అప్పుడే తనిఖీ కోసం బస్సును నిలుపుదల చేశారు.. అదే సమయంలో టైర్లలో గాలి పరిశీలించేందుకు డ్రైవర్ కిందకు దిగాడు.. ఇంతలో వెనుక నుంచి ఓ లారీ వచ్చి బస్సును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో వెనుక సీట్లో కూర్చొన్న నలుగురికి గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు.
భోగాపురం/రింగురోడ్డు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని పోలిపల్లి సమీప జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవిం చింది. ఒడిసా ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవ ర్ ఒడిశా రాష్ట్రం కలహనాడి జిల్లా, బెంటనరీ గ్రామానికి చెందిన బీరేంద్రకుమార్ మల్లిక్(45) అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. మి గతా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు 30 మంది ప్రయాణికులతో వస్తోంది. బ్లాక్‌స్పాట్‌గా గుర్తించిన పోలిపల్లి సమీప మలుపు వద్దకు వచ్చేసరికి ఒడిశాకు చెందిన అధికారులు బస్సును నిలుపుదల చేసి, తనిఖీలు చేశారు. అదే సమయంలో బస్సు డ్రైవర్ బీరేంద్రకుమార్ మల్లిక్(45) కిందకు దిగి బస్సు వెనుకచక్రాల గాలి పరిశీలిస్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. దీంతో అప్పటికే బస్సు వెనుక ఉన్న డ్రైవర్ నుజ్జుఅయి పక్కకు తుల్లిపడి అక్కడకక్కడే మృతిచెందాడు. అలాగే బస్సు వెనుక సీట్లో కూర్చున్న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గోపాలపెంటకు చెందిన ఉమామహేశ్వరి, ఎచ్చెర్ల మండలం ఇబ్రహింపట్నంకు చెందిన బీపాన హేమలత, విశాఖపట్నంకు చెందిన వారణాశి జ్యోతి ప్రసాదు, ఉషారాణికి గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులంతా ప్రాణాలతో బయటప డ్డారు. లారీడ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. విషయం తెలుసుకున్న సీఐ దుర్గాప్రసా దరావు, ఎస్‌ఐ దామోదరరావు, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రు లను క్షణాల్లో 108లో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించారు.