“River at the Threshold” అడుగంటి‘నది’
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:15 AM
“River at the Threshold” ఎండల తీవ్రత దృష్ట్యా తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 102.21 మీటర్ల మేర నిల్వ ఉంది. రోజురోజుకూ నీరు తగ్గుముఖం పడుతుండ డంతో ఖరీఫ్ సాగుకు ఇబ్బందులు తప్పవేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గరుగుబిల్లి, మార్చి31(ఆంధ్రజ్యోతి): ఎండల తీవ్రత దృష్ట్యా తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 102.21 మీటర్ల మేర నిల్వ ఉంది. రోజురోజుకూ నీరు తగ్గుముఖం పడుతుండ డంతో ఖరీఫ్ సాగుకు ఇబ్బందులు తప్పవేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పైప్రాంతం నుంచి నదిలోకి 443 క్యూసెక్కులు చేరగా పాత రెగ్యులేటర్ పరిధిలోని కుడి కాలువ గుండా 90 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ నుంచి 200 క్యూసెక్కులను తాగు, సాగునీటి కోసం విడుదల చేశారు. స్పిల్ వేనుంచి మరో 90 క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నా.. దిగువ ప్రాంతాలకు అంతంత మాత్రంగానే నీటి సరఫరా జరుగుతుంది. షట్టర్లు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల ఏటా 200 క్యూసెక్కులు వృథా పోతోందని రైతులు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి.. ఖరీఫ్ సాగుకు ఇబ్బంది లేకుండా చూడాలని వారు కోరుతున్నారు. కాగా షట్టర్ల మరమ్మతులకు రూ. 20 లక్షలు నిఽఽధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని డీఈఈ వై.గనిరాజు తెలిపారు. ఖరీఫ్ సాగుకు నీటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.