Boat Journey ప్రమాదమైనా .. తప్పని పడవ ప్రయాణం
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:01 AM
Risky Yet Inevitable Boat Journey ఎగువ ప్రాంతం ఒడిశాలో వర్షాలు కురుస్తుండడంతో భామిని మండలం వంశధారకు వరద పొటెత్తుతోంది. దీంతో నదితీర ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భామిని,జూలై29(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతం ఒడిశాలో వర్షాలు కురుస్తుండడంతో భామిని మండలం వంశధారకు వరద పొటెత్తుతోంది. దీంతో నదితీర ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఆంధ్రా- ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో.. నేరడి, పసుకుడి రేవుల్లో పడవులను ఆశ్రయిస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. నేరడి నదీ తీరం ఆవల ఖాండవ గ్రామంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయాణికులు పడవలను ఆశ్రయి స్తున్నారు. ఐదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లలేక.. ప్రమాదమైనా ఇలా ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఏటా వర్షాకాలంలో ఈ తిప్పలు తప్పడం లేదని సరిహద్దు ప్రాంతవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఇరు రాష్ర్టాల ప్రభుత్వాలు స్పందించి వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.