Share News

Chicken Prices పెరిగిన చికెన్‌ ధరలు

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:26 PM

Rising Chicken Prices జిల్లాలో కోడి ధరలు పెరిగాయి. దీంతో మాంసం ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. పౌలీ్ట్ర పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలు చికెన్‌ ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

  Chicken Prices  పెరిగిన చికెన్‌ ధరలు

మక్కువరూరల్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కోడి ధరలు పెరిగాయి. దీంతో మాంసం ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. పౌలీ్ట్ర పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలు చికెన్‌ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. వేసవి కావడంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కోళ్లు మరణాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ కారణాలతో మార్కెట్‌లో చికెన్‌కు కొరత ఏర్పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. కాగా ఆదివారం బహిరంగ మార్కెట్‌లో కిలో చికెన్‌ (స్కిన్‌లెస్‌) ధర రూ.340 పలికింది. వారం రోజుల కిందట ఈ ధర రూ.280 వరకు ఉండేది. ఒకేసారి ధర పెరగడంతో వినియోగదారులు మాంసం కొనుగోలుకు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం బాయిలర్‌ కోడి లైవ్‌ కిలో రూ.200, (స్కిన్‌)తో రూ.320, (స్కిన్‌ లెస్‌) రూ.340కు వ్యాపారులు విక్రయిస్తున్నారు. కాగా రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:26 PM