Share News

తరుగు లేకుండా బియ్యం అందజేయాలి

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:06 AM

ఎంఎల్‌ ఎస్‌ పాయింట్‌ నుంచి తరుగు లేకుండా బియ్యం సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకో వాలని మండలంలోని డీలర్లు ఆందోళన చేపట్టారు.

తరుగు లేకుండా బియ్యం అందజేయాలి

  • డీలర్ల ఆందోళన

గజపతినగరం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఎంఎల్‌ ఎస్‌ పాయింట్‌ నుంచి తరుగు లేకుండా బియ్యం సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకో వాలని మండలంలోని డీలర్లు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వారు గురువారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ శోభ, సీఎస్‌డీటీ తరుపతిరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎల్‌ఎస్‌ పా యింట్‌ వద్ద ప్రతినెల తూకం లేకుండా రేషన్‌ డిపోల కు బియ్యం ఇస్తున్నారని తెలిపారు. రేషన్‌ షాపుల్లో లబ్ధిదారులకు ఈ-పాస్‌ విధానం ద్వారా బియ్యం అందజేస్తున్నామని, ఆ విధంగానే ఎంఎల్‌ఎస్‌ పాయిం ట్‌ అధికారులు కూడా రేషన్‌ డిపోలకు బియ్యం సరఫ రా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. మండల డీల ర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:06 AM