Share News

Pedapenki పెదపెంకిలో అభివృద్ధి పనులపై ఆరా

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:06 AM

Review of Development Works in Pedapenki పెదపెంకిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి ఆదేశించారు. గురువారం గ్రామంలో కొనసాగుతున్న వివిధ పనులను పరిశీలించారు.

  Pedapenki పెదపెంకిలో అభివృద్ధి పనులపై ఆరా
పెదపెంకిలో కాలువ పనులను పరిశీలిస్తున్న ఇన్‌చార్జి జేసీ వైశాలి

సీతానగరం (బలిజిపేట), ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): పెదపెంకిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి ఆదేశించారు. గురువారం గ్రామంలో కొనసాగుతున్న వివిధ పనులను పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, పనుల ప్రస్తుత పరిస్థితిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి సంబంధించి చేపట్టిన పనులు ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా ఉండాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడరాదని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. సమన్వయంతో పనిచేసి .. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

Updated Date - Aug 21 , 2026 | 12:06 AM