Share News

Revenue Services ప్రజలకు మరింత చేరువగా రెవెన్యూ సేవలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:57 PM

Revenue Services Closer to the People ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మే 10 నాటికి క్షేత్రస్థాయిలో భూ రికార్డుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. రీసర్వేలో ఎన్‌పీవోఎల్‌ఆర్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఈకేవైసీ శతశాతం పూర్తి చేయాలన్నారు.

Revenue Services  ప్రజలకు మరింత చేరువగా రెవెన్యూ సేవలు
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

పార్వతీపురం, ఏప్రిల్‌29(ఆంధ్రజ్యోతి): ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మే 10 నాటికి క్షేత్రస్థాయిలో భూ రికార్డుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. రీసర్వేలో ఎన్‌పీవోఎల్‌ఆర్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఈకేవైసీ శతశాతం పూర్తి చేయాలన్నారు. మే 13 నాటికి పెండింగ్‌లో ఉన్న మ్యూటేషన్‌ పూర్తి చేసి .. 17 నాటికి ఆధార్‌, డేటా సవరణలు పూర్తి చేయాలని సూచించారు. రీసర్వే ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తి చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రీ సర్వే చేసినప్పుడు తహసీల్దార్లు మినిట్స్‌ నోట్‌ చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులో ఏమైనా సందేహాలు వస్తే సంబంధిత వ్యక్తిని విచారించాలని సూచించారు. రెవెన్యూ క్లినిక్‌కు వచ్చిన దరఖాస్తుల్లో పురోగతి కనిపించాలన్నారు. ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్‌కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారనే దానిపై నివేదిక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్‌కలెక్టర్లు వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్వో కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 11:57 PM