Revenue of Rs 9.51 crore ఆదాయం రూ.9.51 కోట్లు
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:00 PM
Revenue of Rs 9.51 crore జిల్లాలో ఖాళీగా వున్న 25 మద్యం దుకాణాలకు గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ జరిగింది. దరఖాస్తుదారులకు పారదర్శకంగా మద్యం దుకాణాలు కేటాయించారు. లైసెన్సు ఫీజు, పర్మిట్ రూం ఫీజు ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.9 కోట్ల 51 లక్షల ఆదాయం సమకూరింది.
ఆదాయం రూ.9.51 కోట్లు
లాటరీతో 25 మద్యం షాపుల కేటాయింపు పూర్తి
ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న కలెక్టర్
విజయనగరం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఖాళీగా వున్న 25 మద్యం దుకాణాలకు గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ జరిగింది. దరఖాస్తుదారులకు పారదర్శకంగా మద్యం దుకాణాలు కేటాయించారు. లైసెన్సు ఫీజు, పర్మిట్ రూం ఫీజు ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.9 కోట్ల 51 లక్షల ఆదాయం సమకూరింది. విజయనగరం నగర పాలక సంస్థపరిధిలో మూడు మద్యం దుకాణాలు, భోగాపురం మండలంలో 1, చీపురుపల్లి మండలంలో 4 మద్యం దుకాణాలు, దత్తిరాజేరు మండలంలో 2, డెంకాడ మండలంలో 2 గజపతినగరం మండలంలో ఒకటి, గంట్యాడ మండలంలో 1 గరివిడి మండలంలో 3, మెరకముడిదాంలో 1, నెల్లిమర్ల నగర పంచాయితీలో 1, పూసపాటిరేగ మండలంలో 3, రామభద్రపురం మండలంలో2, రేగిడిలో 1, సంతకవిటిలో ఒక షాపునకు లాటరీ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ సందర్భంగా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ మద్యం దుకాణాలను లాటరీ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా కేటాయించామన్నారు. లైసెన్సు ఫీజు, పర్మింట్ ఫీజు కింద ప్రభుత్వానికి రూ.9 కోట్ల 51 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస చౌదరి, డీఆర్‌ఓ, ఎక్సైజ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ శ్రీనాఽధుడు, ఏఈఎస్ దొరతో పాటు మద్యం దుకాణాదారులు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.