Share News

మద్యం అమ్మకాలతో రూ.1344కోట్ల ఆదాయం

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:23 AM

గత ఆర్థిక సంవత్సరం(2025-2026)లో జిల్లాలో మద్యం అమ్మకాలతో రూ.1344 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ వై.శ్రీనివాస చౌదరి తెలిపారు.

మద్యం అమ్మకాలతో రూ.1344కోట్ల ఆదాయం

  • ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస చౌదరి

భోగాపురం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): గత ఆర్థిక సంవత్సరం(2025-2026)లో జిల్లాలో మద్యం అమ్మకాలతో రూ.1344 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ వై.శ్రీనివాస చౌదరి తెలిపారు. భోగాపురం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ఏడాది కంటే ఆదాయం తగ్గినా మద్యం కేసుల అమ్మకా లు పెరిగాయన్నారు. 2024-2025 ఏడాదిలో లిక్కరు కేసులు 17,65,507, బీరు కేసులు 6,40,418 అమ్మకాలు జరగ్గా.. తద్వారా రూ.1374కోట్ల ఆదాయం వచ్చిందన్నా రు. అయితే 2025-26 ఏడాదిలో 18,55,396 లిక్కర్‌ కేసులు, 9,41,475 బీరు కేసులు అమ్మకాలు జరగ్గా.. తద్వారా రూ.1344కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. 2025 మార్చి నెలలో రూ.119కోట్లు ఆదాయం రాగా, 2026 మార్చిలో రూ.125కోట్ల ఆదాయం వచ్చింద న్నా రు. 2025-26లో 808 మద్యం కేసులు నమోదు చేసి, 809 మందిని రిమాండుకు తరలించామని చెప్పారు. ఈ కేసుల్లో 1290 లీటర్ల లిక్కరు, 28 లీటర్ల బీరు సీజ్‌ చేశామని తెలిపారు. జిల్లాలో 169 మద్యం దుకాణాలు, 26 బార్‌లు ఉన్నాయన్నారు. అనంతరం రికార్డులు తని ఖీ చేశారు. సీఐ వి.రవికుమార్‌, ఎస్‌ఐ చంద్రమోహన్‌, ట్రైనీ ఎస్‌ఐ జె.రమణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:23 AM