Share News

ఐదు నెలల్లో రూ.603 కోట్ల ఆదాయం

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:09 AM

జిల్లాలో ఐదు నెలలకు గాను ప్రొహిబి షన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ద్వారా ప్రభుత్వానికి రూ.603 కోట్లు ఆదాయం వచ్చిందని డిప్యూ టీ కమిషనర్‌ వై.శ్రీనివాస చౌదరి తెలిపారు.

 ఐదు నెలల్లో రూ.603 కోట్ల ఆదాయం

  • ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసచౌదరి

భోగాపురం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఐదు నెలలకు గాను ప్రొహిబి షన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ద్వారా ప్రభుత్వానికి రూ.603 కోట్లు ఆదాయం వచ్చిందని డిప్యూ టీ కమిషనర్‌ వై.శ్రీనివాస చౌదరి తెలిపారు. భోగాపురం ఎక్సైజ్‌ స్టేషన్‌ను ఆయన ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 10 స్టేషన్ల పరిధిలో 169 మద్యం షాపుల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి ఆగస్టు వరకు రూ.560 కోట్లు లక్ష్యం కాగా.. రూ.603 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబరు 30తో మద్యం షాపులకు గడువు తీరగా 169 మద్యం షాపులకు 139 మద్యం షాపులకు రెన్యువల్‌ చేసుకున్నారని తెలిపారు. ఇంకా 30 షాపులకు రెన్యువల్‌ చేసుకోవల్సి ఉందన్నారు. అయితే మద్యంషాపుల లైసెన్సుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చేనెల 1వ తేదీ వరకు సమయం ఉందని తెలిపారు. ఒక్కో షాపునకు లైసెన్స్‌ పీజు రూ.71.50 లక్షలు అని ఈ ఫీజు నాలుగు వాయిదాల్లో చెల్లించాలని, అలాగే పరిమిట్‌ రూమ్‌కు అదనంగా రూ.7.50లక్షలని ఈ ఫీజు మూడు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుం దన్నారు. వచ్చిన దరఖాస్తులు కలెక్టరేట్‌లో వచ్చే నెల 5న అందరి సమక్షంలో డ్రా తీస్తారని చెప్పారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాల న్నారు. జిల్లాలో ఈ ఏడాదిలో 456 కేసులు నమోదు చేశామని, 622 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లాల్లో ఎక్కడా సారా లేదని ఆయన స్పష్టంచేశారు. అలాగే అంతకముందు మద్యం షాపుల లైసెన్స్‌దారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ బమ్మిడి శ్రీనాధుడు, సీఐ రవికుమార్‌, టాస్క్‌ఫో ర్స్‌ సీఐ గంగాధర్‌, ఎస్‌ఐ చంద్రమోహన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 12:10 AM