Share News

భూసమస్యల పరిష్కారానికే ‘రెవెన్యూ క్లినిక్‌’

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:51 PM

గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి విలేజ్‌ రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

భూసమస్యల పరిష్కారానికే ‘రెవెన్యూ క్లినిక్‌’
అర్జీదారుతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

కొమరాడ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి విలేజ్‌ రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం విక్రంపురం సచివాలయంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అక్కడిక్కడే అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మారు మూల గ్రామాల ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండరాదనే ఉద్దేశంతో సచివాలయ స్థాయిలోనే ఉన్నతాధికారులు అందుబాటులో ఉండటం వల్ల పనుల్లో జాప్యం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, ఎంపీటీసీ సభ్యుడు దేవకోటి వెంకటనాయుడు, గ్రామపెద్దలు కె.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:51 PM