రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి
ABN , Publish Date - May 21 , 2026 | 11:52 PM
విజయవాడలో బుధవా రం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ముదిలి వెంకన్న(45) అక్కడికక్కడే మృతిచెందారు.
రాజాం రూరల్, మే 21 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో బుధవా రం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ముదిలి వెంకన్న(45) అక్కడికక్కడే మృతిచెందారు. ఆర్మీలో ఉద్యోగ విరమణ అనంతరం రైల్వేశాఖలో విధులు నిర్వహిస్తున్న వెంకన్న బుధవారం రాత్రి తన ఇంటికి వెళ్తుండగా గురుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడి వివరాలు సకాలంలో లభ్యం కాకపోవడంతో బుధవారం రాత్రి వెంకన్న మృతదేహాన్ని విజయవాడ పొలీసులు మార్చ్యురీలో ఉంచారు. గురువారం ఉద యాన్నే ప్రమాదానికి సంబంధించిన వివరాలను మృతుడి భార్యకు తెలియజే శారు. దీంతో ఆమె అందించిన సమాచారం మేరకు గెడ్డవలస నుంచి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం విజయవాడ వెళ్లారు.