Resurvey రీసర్వే పనులు వేగవంతం
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:36 PM
Resurvey Works Accelerated జిల్లాలో చేపడుతున్న భూ రీసర్వే పనుల్లో వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో సమీక్షించారు. నిర్దేశించిన గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలన్నారు.
పార్వతీపురం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపడుతున్న భూ రీసర్వే పనుల్లో వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో సమీక్షించారు. నిర్దేశించిన గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీసర్వే ద్వారా రికార్డుల ప్రక్షాళన జరుగు తుందని, దీనివల్ల రైతులకు శాశ్వత భూ హక్కులు లభిస్తాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే పనులను తహసీల్దార్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎక్కడా జాప్యం జరగకుండా చూడాల న్నారు. సర్వే సమయంలో భూ యజమానులు నుంచి వచ్చే అభ్యంతరాలు, సరిహద్దు వివాదాలను చట్టపరంగా పరిష్కరించాలన్నారు రీ సర్వేలో వాడుతున్న ఆధునిక పరికరాలు, డ్రోన్లు ద్వారా పొందిన డేటాను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. రీసర్వే పనుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. మండలాల వారీగా సర్వే పురోగతిని సమీక్షించిన ఆయన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.