రీసర్వే వేగవంతంగా పూర్తి చేయాలి: ఆర్డీవో
ABN , Publish Date - May 21 , 2026 | 12:04 AM
రీసర్వే వేగవంతంగా పూర్తి చేయాలని చీపురుపల్లి ఆర్డీవో సుధారాణి కోరారు. మండలంలో లచ్చన్నవలస గ్రామంలో నిర్వహించిన రీ-సర్వేను బుధవారం ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
రేగిడి, మే 20 (ఆంధ్రజ్యోతి): రీసర్వే వేగవంతంగా పూర్తి చేయాలని చీపురుపల్లి ఆర్డీవో సుధారాణి కోరారు. మండలంలో లచ్చన్నవలస గ్రామంలో నిర్వహించిన రీ-సర్వేను బుధవారం ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రౌండ్ ట్రూత్ ప్రక్రియను ఆమె ఆరా తీశారు. రైతుల నుంచి ఈకేవైసీ పూర్తి చేసి సర్వే చేయాలని, సర్వే ప్రక్రియ పక్కాగా ఉండాలని ఆమె ఆదేశించారు. లచ్చన్నవలస రెవెన్యూలో ఉన్న భూముల వివరాలను ఆమె తహసీల్దారు ఈశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. ఐదో ఫేజ్‌లో ఆరు గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేలో ఎటువంటి లోపాలు లేకుండా సిబ్బంది బాధ్యత వహించాలని ఆమె సూచించారు. ఆమె వెంట డీఐఓ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.