Share News

Resurvey mistakes can not be corrected! రీసర్వే తప్పులు సరిదిద్దలే!

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:06 AM

Resurvey mistakes can not be corrected! వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలకు, ప్రస్తుత ప్రభుత్వంలో ఇస్తున్న పాసు పుస్తకాలకు పెద్దగా తేడా లేదు. అప్పటి సీఎం జగన్‌ ఫొటోను తప్పించడం మినహా మార్పుల్లేవు. రాజముద్ర, రైతు ఫొటోతో ఇస్తున్నప్పటికీ అప్పటి రీ సర్వేలో దొర్లిన తప్పులను యఽథావిధిగా ప్రస్తుత ప్రభుత్వం ముద్రించేసింది. వీటినే ఇప్పుడు గ్రామ సభల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నారు. తప్పులు లేని పట్టాదారు పాసుపుస్తకా

Resurvey mistakes can not be corrected! రీసర్వే తప్పులు  సరిదిద్దలే!

రీసర్వే తప్పులు

సరిదిద్దలే!

పట్టాదారు పాసు పుస్తకాల్లో పెద్దగా మార్పుల్లేవ్‌

తొలగించిన జగన్‌ ఫొటో

ఈ నెల 9వరకు పంపిణీ చేయనున్న రెవెన్యూ

తప్పులన్నింటినీ సరిచేయాలంటున్న రైతులు

వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలకు, ప్రస్తుత ప్రభుత్వంలో ఇస్తున్న పాసు పుస్తకాలకు పెద్దగా తేడా లేదు. అప్పటి సీఎం జగన్‌ ఫొటోను తప్పించడం మినహా మార్పుల్లేవు. రాజముద్ర, రైతు ఫొటోతో ఇస్తున్నప్పటికీ అప్పటి రీ సర్వేలో దొర్లిన తప్పులను యఽథావిధిగా ప్రస్తుత ప్రభుత్వం ముద్రించేసింది. వీటినే ఇప్పుడు గ్రామ సభల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నారు. తప్పులు లేని పట్టాదారు పాసుపుస్తకాలను వేరు చేసి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందిస్తున్నారు.

శృంగవరపుకోట, జనవరి 5(ఆంధ్రజ్యోతి):

జిల్లా వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం 423 గ్రామాల్లో రీ సర్వే చేయించింది. దీని ఆధారంగా 2,02,609 రైతు కుటుంబాలకు పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయి. వీటిల్లో సోమవారం మధ్యాహ్నానికి 44,837 పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. భూ యజమానిగా ఉన్న రైతుకు స్వయంగా 29,963, హౌస్‌ హోల్డ్‌లో నమోదైన కుటుంబ సభ్యులకు 14,851, చుట్టుపక్కల వారికి 23 పట్టాదారు పాసు పుస్తకాలను ఇవ్వడం ద్వారా రైతులకు అందేలా చేశారు. ఇంతవరకు బాగున్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం చేసిన రీసర్వే తప్పులను సరిద్దికుండా ఆ డేటాతో ముద్రించి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. సగానికికి పైగా తప్పులతోనే ఉన్నాయని రెవెన్యూ అధికారులే అంగీకరిస్తున్నారు. తప్పులు లేని వాటినే పంపిణీ చేస్తామని తొలుత చెప్పిన రెవెన్యూ తాజాగా అన్నింటినీ పంపిణీ చేసేస్తామని చెబుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సూచనలను పాటించడం తప్ప తామేమీ చేయలేమన్న విధంగా మాట్లాడుతున్నారు.

ఆ ప్రభుత్వంలో మొదలైన రీసర్వే

వైసీపీ ప్రభుత్వం భూములను రీసర్వే చేయించిన సంగతి తెలిసిందే. రీసర్వే జరిగిన భూములకు హద్దులుగా అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో ఉన్న హద్దు రాళ్లను పాతారు. అంతటితో ఆగకుండా భూ హక్కును నిర్ధారించే పట్టాదారు పాసు పుస్తకంపైనా జగన్‌ ఫొటోను ముద్రించారు. రైతులకు చెందిన భూములన్నీ అప్పటి సీఎం జగన్‌వే అన్నవిదంగా భావించేలా పాసు పుస్తకాలు కనిపించాయి. అప్పటికే భూ ఆక్రమణలు, సెటల్‌మెంట్లు, జిరాయితీ భూములను 22(ఎ)లో నమోదు చేయడం ద్వారా బెదిరింపులకు దిగడంతో అప్పట్లో రైతులు భయోందోళన చెందారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం కూడా మారింది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టారు. రీసర్వే జరిగిన గ్రామాల్లోని భూముల హద్దులకు పాతిన జగన్‌ ఫొటో సర్వే రాళ్లు అన్నింటినీ యుద్ధ ప్రాతిపాదికన తీసిపారేశారు. జగన్‌ ఫొటోతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలన్నింటినీ వెనక్కితీసుకున్నారు. వాటి స్థానంలో కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలను తయారు చేయించారు.

తప్పులు సవరించకుండా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజముద్ర, పాసు పుస్తకంపై రైతు ఫొటోను ముద్రించారు. ఖాతా నెంబర్‌, పాత సర్వే నెంబర్‌, రీసర్వేలో ఇచ్చిన ఎల్‌పీఎం నెంబర్‌, రైతు పేరు, భూస్థితి వంటి వివరాలను నమోదు చేశారు. ప్రతి ఎల్‌పీఎం నెంబర్‌కు వున్న హద్దులతో కూడిన పటాలను ముద్రించారు. అయితే రీసర్వేలో అనేక తప్పులు దొర్లాయి. అత్యధికంగా జాయింట్‌ ఎల్‌పీఎం నెంబర్‌లను నమోదు చేయడంతో ఇద్దరికి మించి వున్న రైతుల భూములు కలిసిపోయాయి. భూ హక్కుదారులను గుర్తించేందుకు స్పష్టత లేకుండా చేశారు. దీంతో క్రయ, విక్రయాలకు విఘాతం కలిగింది. అదే విధంగా భూ కొలతల్లోనూ తేడాలు వచ్చాయి. రెండు, మూడు సర్వేనెంబర్‌లకు చెందిన విస్తీర్ణంలో ఒకదాన్ని తప్పించి మొత్తం విస్తీర్ణంలో మిగిలిన సర్వే నెంబర్‌లలో కలిపేయడం వంటి తప్పులెన్నో జరిగాయి. ఇవన్నీ గుర్తించిన కూటమి ప్రభుత్వం వాటిని సరిదిద్దేందుకు గ్రామ సభలను ఏర్పాటు చేసింది. ఈ గ్రామ సభల్లో జిల్లా వ్యాప్తంగా రీసర్వే జరిగిన గ్రామాల నుంచి 23,113 దరఖాస్తులను రైతుల నుంచి అధికారులు అందుకున్నారు. వీటితో పాటు పీజీఆర్‌ఎస్‌లలోనూ వినతులు అందుతున్నాయి.

ఫ రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వం పాత డేటాతోనే పాసు పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తుండడం రైతులకు అంతుపట్టడం లేదు. తప్పులను సరి చేసిన తరువాతే ఇవ్వాలని వారు కోరుతున్నారు.

------------

Updated Date - Jan 06 , 2026 | 12:06 AM