Share News

Couple in Love క్షణాల్లో స్పందించి.. ప్రేమ జంటను కాపాడి..

ABN , Publish Date - May 25 , 2026 | 11:53 PM

Responded Within Moments, Saved the Couple in Love శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పై సోమవారం ఆత్మహత్యకు యత్నించిన ప్రేమికులను శక్తిటీం పోలీసులు రక్షించారు.

  Couple in Love  క్షణాల్లో స్పందించి.. ప్రేమ జంటను కాపాడి..

ఆమదాలవలస/పాలకొండ, మే25(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పై సోమవారం ఆత్మహత్యకు యత్నించిన ప్రేమికులను శక్తిటీం పోలీసులు రక్షించారు. పాలకొండ ప్రాంతానికి చెందిన వారు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియజేసినా వారి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమ జంట ఈ నెల 19న ఇంటి నుంచి వెళ్లిపోయారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు. దీంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమదాలవలసలోని రైలు పట్టాలపై నిల్చొన్నారు. దీనిని గమనించిన ఆమదాలవలస శక్తిటీం ఇన్‌చార్జి హెచ్‌సీ టి.అమ్మాజీ, కానిస్టేబుల్‌ ధనలక్ష్మి వెంటనే అప్రమత్తమై ప్రేమ జంటను రక్షించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌కు తెలియజేశారు. అనంతరం ప్రేమ జంటను పాలకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ప్రేమజంట ప్రాణాలను కాపాడిన శక్తి టీం సిబ్బందిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అభినందించారు.

Updated Date - May 25 , 2026 | 11:53 PM