ప్రజా సమస్యలపై సానుకూలంగా వ్యవహరించండి
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:16 AM
గ్రామాల్లో ప్రజా సమ స్యల పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు సానుకూలంగా వ్యవహ రించాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సూచించారు.
టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే కళా సూచన
చీపురుపల్లి, సెప్టెంబ రు 5(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజా సమ స్యల పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు సానుకూలంగా వ్యవహ రించాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సూచించా రు. చీపురుపల్లిలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నాయకుడు, కార్యకర్త గ్రామ స్థాయిలో చురుగ్గా పనిచేయా లన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకు లు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, ఏఎంసీ చైర్మన్ రేగాన రామారా వు, పైల బలరాం, సారేపాక సురేష్, పీఏసీఎస్ చైర్మన్ అలమండ నరసింహమూర్తి, గంట్యాడ సత్యనారాయణ, గడే సన్యాసప్పలనాయుడు, రమేష్ పాల్గొన్నారు.
గ్రామీణ మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి..
రాజాం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు జడ్పీ సీఈవో ఎ.లవరాజుకు సూచించారు. శనివారం రాత్రి రాజాంలోని తన క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన జడ్పీ సీఈవోతో ఆయన చీపురుపల్లి నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్ పరిధిలోని మౌలిక వసతులపై సమీక్షించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. అత్యవసరమైన మౌలిక వసతుల పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.