Respect for the Telugu nation with NTR ఎన్టీఆర్‌తో తెలుగు జాతికి గౌరవం
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:11 AM
Respect for the Telugu nation with NTR ప్రపంచస్థాయిలో తెలుగు జాతికి గౌరవం తీసుకువచ్చిన నేత టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
ఎన్టీఆర్‌తో తెలుగు జాతికి గౌరవం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గంట్యాడ/గజపతినగరం, జనవరి 18(ఆంధ్రజ్యోతి):
ప్రపంచస్థాయిలో తెలుగు జాతికి గౌరవం తీసుకువచ్చిన నేత టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నరవ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, ఆయన ఆశయ సాధనకు సీఎం చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సుంకరి రామునాయడు అందించిన దుప్పట్లను మంత్రి పేదలకు అందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, గంట్యాడ, జామి టీడీపీ మండల అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు, స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
- ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకొని గజపతినగరం స్టేట్‌బ్యాంక్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కూడా మంత్రి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. తొలుత పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీగా చేరుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, పీఏసీఎస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, గజపతినగరం,దత్తిరాజేరు, గంటాడ, బొండపల్లి టీడీపీ మఽండల అధ్యక్షులు గంట్యాడ శ్రీదేవి, చప్పా చంద్రశేఖర్, కొండపల్లి భాస్కరనాయుడు, రాపాక అచ్చునాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకొని నివాళి అర్పించారు.