Resolving Revenue Issues రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:16 AM
Resolving Revenue Issues Is the Prime Objective రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయా లని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, డీసీఎంఎస్, ఇతర రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, జనవరి12(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయా లని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, డీసీఎంఎస్, ఇతర రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చిన అర్జీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదికలను క్షుణ్నగా పరిశీలించారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా అకారణంగా పెండింగ్‌లో ఉండ రాదన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, వాటిపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ప్రతి సోమవారం ప్రజల నుంచి అందుతున్న రెవెన్యూ వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారికి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.