ఫిర్యాదుల పరిష్కారమే ధ్యేయం: ఎస్పీ
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:27 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే అధికారుల ఽధ్యేయం కావాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు.
బెలగాం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే అధికారుల ఽధ్యేయం కావాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై 11 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఆయన స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులు ఇచ్చిన వినతిపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సబ్ డివిజన్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌లో కూడా పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తారని, ప్రతి వారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుటుంబ తగాదాలు, నకిలీ పత్రాలు, అత్తారింటి వేధింపులు, అధిక వడ్డీలు, భూ వివాదాలు, సైబర్ క్రైం తదితర అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సీసీఎస్ సీఐ అప్పారావు, ఎస్‌ఐ రమేష్ నాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.