అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:21 AM
అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
బెలగాం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కోర్కెల దినం సందర్భంగా శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మన్మఽథరావు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు వేతనాలు పెంచడంతో పాటు నవచేతన యాప్‌ను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు అమరవేణి, ఎం.ఉమామహేశ్వరి, గంట జ్యోతిలక్ష్మి, సీఐటీయూ నాయకులు రమణారావు, ఇందిర, సూరిబాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి బి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.