డీలర్ల సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:12 AM
రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు చొక్కాపు రామారావు కోరారు.
రామభద్రపురం, జనవరి8 (ఆంధ్రజ్యోతి): రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు చొక్కాపు రామారావు కోరారు. గురువారం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ గత నాలుగు నెలల నుంచి కమీషన్ ఇవ్వడం లేదన్నారు. క్వింటా బియ్యం బస్తాకు రూ.300 కమీషన్ పెంచాలన్నారు. డీలర్లకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. అలాగే డీలర్లకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించాలని, 60 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా డీలర్ల సంఘం కార్యదర్శి ఉమాశంకరరావు, రామభద్రపురం ఎంపీటీసీ సభ్యుడుు భవిరెడ్డి చంద్ర పాల్గొన్నారు.