Share News

వినతులను పరిష్కరించండి: కలెక్టర్‌

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:00 AM

వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి సంబం దించిన శాఖ అధికారులకు ఆదేశించారు.

వినతులను పరిష్కరించండి: కలెక్టర్‌

విజయనగరం కలెక్టరేట్‌ అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి సంబం దించిన శాఖ అధికారులకు ఆదేశించారు. సోమవారం విజయనగరంలో నిర్వ హించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లాలోని వివిధ సమస్యలపై 218 వినతులు వచ్చాయి. వీటిని కలెక్టరు రామసుందర్‌రెడ్డి, జేసీ సేతుమాధవన్‌, డీఆర్వో చందక సత్తిబాబు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వినతులు స్వీకరించారు.వచ్చిన వినతుల్లో 106 రెవెన్యూ సమస్యలు కాగ, పంచాయతీరాజ్‌ 26కు సంబంధించి ఉన్నాయి. గంట్యాడ మం డలంలోని పెదవేమలికి చెందిన ఇమంది శ్రీను, నాగమణి దంపతులు తమ కుమార్తెకు పింఛన్‌ పెంచి ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు.

తినుబండారాలపై నమ్మకం పెరగాలి: కలెక్టర్‌

విజయనగరం కంటోన్మెంట్‌ అక్టోబరు 12 (ఆంధ్ర జ్యోతి): మహిళలు స్వ యంశక్తితో చేస్తున్న వ్యాపారం ఆర్థికంగా ఎదగాలంటే తయారు చేస్తున్న వసు వులు, పోషక విలువలతో కూడిన చిరు తినుబండారాలపై నమ్మకం పెరగాలని కలెక్టర్‌ ఎస్‌.రామసుందరరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో పీజీ ఆర్‌ఎస్‌ ముగింపు తర్వాత బయటకు వచ్చిన ఆయన అక్కడే ఉన్న స్వయం శక్తి సంఘాలు ఏర్పాటు చేసిన తినుబండారాల స్టాల్‌ను సందర్శించారు.

వినతిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి : కలెక్టఏరట్‌ 1

=====================

Updated Date - Oct 13 , 2026 | 12:10 AM