Education Sector విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:32 PM
Resolve Issues in the Education Sector విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా జిల్లా కార్యదర్శి రవి ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
బెలగాం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా జిల్లా కార్యదర్శి రవి ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వలరాజు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిను తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి, ప్రతీ విద్యార్థి చదువుకునే అవకాశం కల్పించాలన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో తరగతుల కుదింపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన 4,500 ప్రభుత్వ పాఠశాలలను తిరిగి పునఃప్రారంభించాలని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేయాలన్నారు. వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు సురక్షిత నీరు, నాణ్యమైన భోజనం అందించాలని, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని నినదించారు. ఇటీవల సంభవించిన గిరిజన విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించాలన్నారు. ఈ నిరసనలో ఏఐటీయూసీ నాయకుడు కుమార్, జిల్లా నాయకులు చరణ్‌వికాస్, గోవింద్, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.