Share News

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి: జేఏసీ

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:28 AM

: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని విజయనగరం జిల్లా జేఏసీ డిమాండ్‌ చేసింది. గురువారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన జేఏసీ చైర్మన్‌ ఆవు సురేష్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు అనుకూలమైన ప్రయోజనాలను ప్రభుత్వం అందించాలని డిమాండ్‌ చేశారు.

 ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి: జేఏసీ
మాట్లాడుతున్న సురేష్‌

విజయనగరం కంటోన్మెంట్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని విజయనగరం జిల్లా జేఏసీ డిమాండ్‌ చేసింది. గురువారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన జేఏసీ చైర్మన్‌ ఆవు సురేష్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు అనుకూలమైన ప్రయోజనాలను ప్రభుత్వం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 5వ తేదీలోగా ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని... లేకుంటే తదుపరి కారాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు డి. రాము, రమేష్‌ చంద్ర పట్నాయక్‌, జోగినాయుడు, ఎన్‌వీ పైడిరాజు, శ్రీధర్‌బాబు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 12:28 AM